AG 80 1. పరమ జీవము నాకు నివ్వ...
Versi Version 1
1
పరమ జీవము నాకు నివ్వ...
తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నడిపించును
మరల వచ్చి యేసు కొని పోవును
యేసు చాలును
యేసు చాలును
యే సమయమైన యే స్థితికైనా
నా జీవితములో యేసు చాలును
2
సాతాను శోధన లధికమైన
సొమ్మసిల్లక సాగి వెళ్లెదను
లోకము శరీరము లాగినను
లోబడక నేను వెళ్ళెదను ||యేసు||
3
పచ్చిక బయలులో పరుండ జేయున్‌
శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్‌
మరణలోయలో నన్ను కాపాడును ||యేసు||
4
నరులెల్లరు నన్ను విడిచినను
శరీరము కుళ్ళి కృశించినను
హరించినన్‌ నా ఐశ్వర్యము
విరోధివలె నను విడిచినను ||యేసు||

OK