AG 150 నన్ను గన్నయ్య రావె నా యేసు
Versi Version 1
నన్ను గన్నయ్య రావె నా యేసు
నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||న||
1
ముందు నీ పాదారవిందము
లందు నిశ్చల భక్తి ప్రేమను
పొందికగా జేయరావే నా
డెందమానంద మనంతమైయుప్పొంగ
2
హద్దులేనట్టి దురాశల
నవివేకినై కూడి యాడితి
మొద్దులతో నింక కూటమి
వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి
3
కాలము పెక్కు గతించెను
గర్వాదు లెడదెగవాయెను
ఈ లోకమాయ సుఖేచ్ఛలు
చాలును జాలును జాలు నోతండ్రి
4
దారుణ సంసార వారధి
దరి జూపి ప్రోవ నీ కన్నను
కారణ గురువు లింకెవ్వరు
లేరయ్య - లేరయ్య లేరయ్య తండ్రి
5
నా వంటి దుష్కర్మ జీవిని
కేవలమగు నీదు పేర్మిని
దీవించి రక్షింపనిప్పుడే
రావయ్య రావయ్య రావయ్య తండ్రి

OK