AG 183 ఆనందమానందమాయెను
Versi Version 1
ఆనందమానందమాయెను
నాదు ప్రియ కుమారుని యందు
నా తనయుని మాట వినండని
శబ్దమొక్కటి యా మేఘములో
ఉద్భవించె నద్భుతముగ ||మహ||
1
ప్రేమించుచున్నావు నీతిని
దుర్నీతిని ద్వేషించినావు - నీవు
అందుచే నీ తోటి వారి కంటె
ఆనందతైలముతో తండ్రి నిన్ను
అధికంబుగా నభిషేకించెను. ||మహ||
2
అంత్యదినముల యందున
ఆ వింత కుమారుని ద్వారా
ఈ మానవుల తోడ మాట్లాడెను
సర్వంబునకు తండ్రి తనయుని
వారసునిగా నియమించెను ||మహ||
3
తనయుండె ఆ తండ్రి మహిమ
ఆ తత్వంబు రూపంబు తానె
ఆ మహాత్మ్యమైనట్టి మాట చేత
సమస్తమును నిర్వహించుచు
అందరిలో అతి శ్రేష్ఠుండాయె ||మహ||
4
నీవు నాదు కుమారుండవు
నిన్ను ప్రేమించి కన్నాను నేను
నేడు దండిగ తనయుని ముద్దాడుడి
నిండుగ వాని నాశ్రయించుడి
రండి రండి-ధన్యులు కండి ||మహ||
5
విజ్ఞాన సంపదలెల్లను
ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను
ఆ సంతోషమును పరిశుద్ధత
సమాధానము నీతి శక్తియు
విమోచనమాయెను యేసు ||మహ||
6
అందరి కన్న నీ వెంతనో
అతి సుందరుడవై యున్నావు
నీవు నీ పెదవుల మీద పోయబడి
నిండి యున్నది దయారసము
నిన్నాశీర్వదించును తండ్రి ||మహ||
7
దివ్య రారాజై కుమారుడు
ఒక వెయ్యి వర్షాలు పాలించును
మహా అంతములేని రాజ్యమేలును
ఎందరు జయంబు నొందెదరో
అందరును పాలించెదరు ||మహ||

OK