AG 220 ప్రభు ప్రేమ తొలికేక
Versi Version 1
ప్రభు ప్రేమ తొలికేక
హృదయములో ప్రతి ధ్వనియించె
పాపక్షమ-యేసునిలో
శరణునొసంగుచు కనిపించె
1
పాపవికారము పొడసూప
జీవిత విలువలు మరుగాయె
పతితనుగా లోకములో
బ్రతుకుటయే నా గతియాయె
పలువురిలో కనబడలేక
దాహముతో నే నొంటరిగా
బావికని పయనింప
నాథుని దర్శనమెదురాయె
పావనుడు దాహముతో
పానము నిమ్మని ననుగోరె ||ప్రభు||
2
జాతిని చూడని నేత్రముతో
పాపము శోకని హృదయముతో
జాలిని చాటించుచునే
తాకను నా మది వేదనతో
జాప్యము చేయక తెమ్మనియె
దాచుకొనిన నా పాపమును
జడియుచునే తెలిపితిని
ప్రభు వెరిగిన నా నిజస్థితిని
జయమొందె నా తనువు
సరిగనుడితివని ప్రభు తెలుప ||ప్రభు||
3
దేహమునే నా సర్వముగా
భావించుచు మది పూజింప
దినదినము జీవితము
చావుగ మారిన కాలముతో
దేవునిగా నా బంధువుగా
మరణ బంధములు ఛేదించి
దరిచేర్చి దీవించి
నూతన జన్మ ప్రసాదించె
దయ్యాల కుహరమును
స్తుతిమందిరముగ రూపించె ||ప్రభు||
4
పాపము దాగొను నా బావి
లోతును ఎరిగిన వారెవరు
పోరాట వాటికయౌ
నా బ్రతుకును జూచినదెవరు
పాపికి పాపమునకును
భేదము జూపిన వారెవరు
పాపిని కాపాడుటకై
సిలువ ధరించిన వారెవరు
పరదైసు ద్వారములు
ప్రేమతో-తెరచెను నా కొరకై ||ప్రభు||
5
ఘటముతో వెడలితి నొంటరిగా
పితరులు త్రావిన జలములకై
కనబడెను బావికడ
రక్షణయూటల ప్రభుయేసు
కుండను వీడి పరుగిడితి
బావిని చేకొని హృదయములో
ఘనమైన శుభవార్త
ఆతృతతో ప్రజలకు తెలుపా
గ్రామ ప్రజా కనుగొనిరి
విశ్వ విమోచకుడగు యేసున్‌ ||ప్రభు||

OK