AG 226 హృదయమనెడు తలుపు నొద్ద
Versi Version 1
హృదయమనెడు తలుపు నొద్ద
యేసునాథుండు
నిలచి సదయుడగుచు దట్టుచుండు
సకల విధములను ||హృదయ||
1
పరుని బోలి - నిలుచున్నాడు
పరికించి చూడ - నతడు
పరుడు గాడు - రక్షకుండు
ప్రాణ స్నేహితుడు ||హృదయ||
2
కరుణా శీలుండతడు గాన
గాచియున్నాడు
యేసు కరుణ నెరిగి గారవింప
గరము న్యాయంబు ||హృదయ||
3
ఎంతసేపు నిలువ బెట్టి
యేడ్పింతురతని
నాత-డెంతో దయచే
బిలుచుచున్నాడిప్పుుడు మిమ్ములను
4
అతడు మిత్రుడతడు
మిత్రు-డఖిల పాపులకు
మీర లతని పిలుపు వింటి రేని
యతడు-ప్రియుడగును ||హృదయ||
5
జాలిచేత దన హస్తముల
జాపియున్నాడు
మిమ్ము-నాలింగనము సేయగోరి
యనిశము కనిపెట్టు ||హృదయ||
6
సాటిలేని దయగల వాడు
సర్వేశు సుతుడు
తన-మాట వినెడు
వారల నెల్ల-సూటిగ రక్షించు ||హృదయ||
7
చేర్చుకొనుడి మీ హృదయమున
శ్రీ యేసు నాధు
నతడు - చేర్చు కొనుచు
మీ కిచ్చును-చిరజీవము గృపను||హృదయ||
8
బ్రతుకు శాశ్వతంబు కాదు
పరికించి చూడ
గాన-బ్రతికియుండు కాలముననే
ప్రభుని గొలువండి ||హృదయ||

OK