AG 229 రండీ రండీ యేసుని యొద్దకు
Versi Version 1
రండీ రండీ యేసుని యొద్దకు
రమ్మనుచున్నాడు
ప్రయాసపడి భారము మోయువారలు
ప్రభుని చెంతకు పరుగిడి వేగమె
1
యేసుని పిలుపు వినియు నింక
యోచింపరేల?
అవనిలో అగచాట్ల పాలైన
అబ్బదు శాంతి ఆత్మకు నిలలో ||రండి||
2
కరవు మరణము రణముల జూచి
కలుగదు మారుమనసు
ప్రవచనములు సంపూర్ణములాయెను
యూదులు తిరిగి వచ్చియున్నారు ||రండి||
3
ప్రభు యేసు నీ కొరకై తనదు
ప్రాణము నిచ్చెగదా
సిలువను రక్తము చిందించియును
బలియాయెను యా ఘనుడు మనకై ||రండి||
4
యేసుని నామము నందే
పరమ నివాసము దొరుకును
ముక్తిని పాప విమోచనమును
శక్తిమంతుడు యేసేయిచ్చును ||రండి||
5
నేనే మార్గము నేనే సత్యము
నేనే జీవమును
నేనే గాకింకెవ్వరు లేరని
యెంచి చెప్పిన యేసుని యొద్దకు ||రండి||
6
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయామెన్‌
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ||రండి||

OK