AG 304 లేచినాడురా సమాధి గెలిచినాడురా
Versi Version 1
లేచినాడురా సమాధి గెలిచినాడురా
యేసు లేతునని తాఁజెప్పినట్లు
లేఖనములో పలికినట్లు
1
భద్రముగ సమాధిపైన
పెద్దరాతిని యుంచిరి భటులు
ముద్రవేసి రాత్రియంత
నిద్ర లేక కావలియున్న ||లేచి||
2
ప్రభువు దూత పరము నుండి
త్వరగ దిగి రాతిని దొర్లించి
భళిర దానిపై గూర్చుండె
భయము నొంద కావలి వారు ||లేచి||
3
ప్రొద్దు పొడవకముందె స్త్రీలు
సిద్ధపరచిన సుగంధములు
శ్రద్ధతోడ తెచ్చి యేసుకు
రుద్దుదామని వచ్చిచూడ ||లేచి||
4
చూడ వెళ్ళిన స్త్రీలను దూత
చూచి యిపుడు వారి తోడ
లేడు గలిలయ ముందుగా పోతున్నాడు
అప్పుడే లేచినాడనె ||లేచి||
5
చచ్చిపోయి లేచినాడు
స్వామి భక్తుల కగుపడినాడు
చచ్చినను నను లేపుతాడు
చావు అంటే భయపడరాదు ||లేచి||
6
నేను చేసే పనుల నెరుగు
నేను నడిచే మార్గ మెరుగు
నేను జెప్పిన మాట లెరుగు
నేను బ్రతికే బ్రతుకు నెరుగు ||లేచి||
7
నేను లేచిన యేసునందు
మానకను మది నమ్ముకొందు
తాను నాలో నుండి నందున
దయను జేర్చును మోక్షమందు ||లేచి||

OK