AG 328 ఉన్నపాటున వచ్చు-చున్నాను
Versi Version 1
ఉన్నపాటున వచ్చు-చున్నాను
నీ పాద-సన్నిధి కో రక్షకా
యెన్న శక్యముగాని పాపము లన్ని
మోపుగ వీపుపైబడి
యున్న నిదె నడలేక తొట్రిలు
చున్నవాడను నన్ను దయగను ||ఉన్న||
1
కారుణ్యనిధియేసు-నా రక్షకా
నీ శ-రీర రక్తము చిందుట
భూరి దయతో నన్ను నీ దరి
జేరరమ్మని పిలుచుటయుని
ష్కారణపు నీ ప్రేమ యిది మరి
వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న||
2
మసి బొగ్గువలె నా మా-ససమెల్లగప్పె
దో-ష సమూహములు మచ్చలై
అసితమగు ప్రతి డాగు తుడువను
గడటుగడిగి పవిత్రపరపను
నసుపు లిడు నీ రక్తమే యని
మసల కిప్పుడు సిలువ నిదెగని ||ఉన్న||
3
వెలుపట బహు యుద్ధ-ములు
లోపటను భయము-కలిగె నెమ్మది
దొలగెను-పలు విధములగు
సందియంబుల-వలనబోరాట
ములచే నే-నలసి యిటునటు
గొట్టబడి దు-ర్భలుడనై
గాయములతో నిదె ||ఉన్న||
4
కడు బీదవాడ నం-ధుడను
దౌర్భాగ్యుడను-జెడిపోయి పడి
యున్నాను-సుడివడిన నా మదికి
స్వస్థత జెడిన కనులకు
దృష్టి భాగ్యము బడయవలసినవన్ని
నీచే-బడయుటకు నా
యొడయడా యిదె ||ఉన్న||
5
నీ వాగ్దాత్తము నమ్మి-నీపై భారము
పెట్టి-జీవమార్గము గంటిని
కేవలంబగు ప్రేమచేతను నీవు
నన్ను క్షమించి చేకొని
భావశుద్ధి నోనర్చి సంతోషావసరముల
నిడుదువని యిదె ||ఉన్న||
6
దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ
తరమే వర్ణన చేయను
తెరవు కడ్డంబైన యన్నిటి-విఱుగ
గొట్టెను గాననే నిపుడరుదుగా
నీవాడ నవుటకు-మరి నిజము
నీ వాడ నవుటకే ||ఉన్న||

OK