AG 81 సిలువను మోసి ఈ లోకమును
Versi Version 1
సిలువను మోసి ఈ లోకమును
తలక్రిందులు చేయు తరుణమిదే
1
లే లెమ్ము సోదరుడా నిద్ర నుండి
ప్రకటించను యేసు నామమును
సోమరి యేల నిద్రించెదవు
ఈ ధరను లేపెడు సమయమిదే ||సి||
2
పరిశుద్ధాత్మ కవచముతొడిగి
నీ నడుము కట్టి తయ్యారగుమా
సోదరుడా ప్రతి వీధికి వెళ్లి
సువార్తను చాటెడు సమయమిదే ||సి||
3
లోక రక్షణకై ప్రభు యేసు
వీకతో నరుదెంచెను ఈ ధరకు
వెలుగును మనకు నిచ్చెను యేసు
తన స్తుతులను పాడెడు సమయమిదే||సి||
4
పాతాళమునకు కొనిపోయెడి నీ
పాత నిద్రను విడనాడు మిక
సిలువ మర్మము నెరుగుమిపుడే
కునికెడు సమయము కాదిది ప్రియుడా||సి||
5
రక్షింపబడుట కాశించినచో
పశ్చాత్తాపపడు మీ దినమే
కలుషాత్ముండా తడవేల నికన్‌
కనుమా నీ తీర్పు సమయమిదే ||సి||

OK