AG 96 స్తోత్రించి కీర్తింతుము
Versi Version 1
స్తోత్రించి కీర్తింతుము
ఘనపరచెదము - కొనియాడెదము
ఆదరించి - కాపాడువాడు
యీడేర్చువాడు ||స్తోత్రి||
1
మన కింతవరకు - సహాయపడెన్‌
తానప్పగిం - చుకొనె మనకై
మనల నడిపెను - సుఖముగను
తనదు సత్యము నేర్పించి
కనుపాపగ కాచె ఆ...ఆ...ఆ...
తనదు సత్యము నేర్పించి... ||స్తోత్రి||
2
ఈ ధరలోని నరులలో
యథార్థ హృదయులకు
ముదమున తన చి - త్తము తెలుపన్‌
పదిలముగా ప్రభు కన్నులు
పృధివిని పరుగెత్తు ఆ...ఆ...ఆ...
పదిలముగా ప్రభు కన్నులు... ||స్తోత్రి||
3
అన్ని సమయ - ములలో
కన్నులతో బోధించును
నన్ను మార్చెను తప్పినన్‌
పన్నుగ హృదయము నాదరించె
అన్న గురు యేసు ఆ...ఆ...ఆ...
పన్నుగ హృదయము... ||స్తోత్రి||
4
అగ్నివంటి కన్నులు
విఘ్నముల నుండి విడిపించున్‌
తగిన సహాయము చేయును
ఎక్కాల మందును కునుకవు
మక్కువ పిల్లలకు ఆ...ఆ...ఆ...
ఎక్కాలమందును... ||స్తోత్రి||
5
హాగరును చూచిన కన్నులు
అనేకుల చూచెను
ఇశ్రాయేలును కనికరించె
ఎజ్రాకు సహాయపడెన్‌
నిద్రించవు నెపుడు ఆ...ఆ...ఆ...
ఎజ్రాకు సహాయ... ||స్తోత్రి||
6
నీతిమంతు - ల జూచె
దాది బోలి కాచెను
జ్యోతులవలె నుండును
అతి బలమిచ్చును అవసరతన్‌
క్షితి నిను విడువడు ఆ...ఆ...ఆ...
అతి బలమిచ్చును అవ... ||స్తోత్రి||
7
ఏడు కన్నులు - గలవాడు
నేడు నాడు కాపాడున్‌
ఎడతెగని చెడుగుల బాపున్‌
ఱేడుల నేర్పరచువాడు
పాడుడి హల్లెలూయ ఆ...ఆ...ఆ...
ఱేడుల నేర్పరచువాడు ||స్తోత్రి||

OK